Raghava Lawrence : రాఘవ లారెన్స్ ‘బుల్లెట్ బండి’ స్టిల్ అదుర్స్

by Chukka Sudharani |   (  Updated:2024-11-03 14:18:10  IST  )

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతగా.. ఇలా మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాఘవా లారెన్స్

Raghava Lawrence : రాఘవ లారెన్స్ ‘బుల్లెట్ బండి’ స్టిల్ అదుర్స్
X

దిశ, సినిమా: కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతగా.. ఇలా మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence). తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈయన వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. రాఘవా లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘బుల్లెట్టు బండి’ (Bullet Bandi Movie)ఒకటి. ఈ సినిమాకు ఇన్నసి పాండ్యన్ (Innasi Pandyan) కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌(Five Star Creations Banner)పై కథిరేశన్ (Kathiresan) నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మేరకు లాఘవ లారెన్స్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో.. మంటల మధ్యలో గుర్రం కనిపిస్తుండగా.. లారెన్స్ సూపర్ స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ దర్శనమిచ్చాడు. ప్రజెంట్ ఈ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తు్న్నాయి. కాగా.. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.

Click Here For Twitter Post..

Next Story