‘డీమోంటే కాలనీ’ దర్శకుడితో చేతులు కలిపిన రాఘవ లారెన్స్

by Pulgam srinivas |

రాఘవ లారెన్స్ తన తదుపరి చిత్రాన్ని ‘డీమోంటే కాలనీ’ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

‘డీమోంటే కాలనీ’ దర్శకుడితో చేతులు కలిపిన రాఘవ లారెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ వ్యక్తిగా గుర్తింపు పొందిన వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న లారెన్స్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ వార్త ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం 'డీమోంటీ కాలనీ' సినిమాతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో రాఘవ లారెన్స్ చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. హార్రర్ జోనర్‌లో ప్రత్యేక ముద్ర వేసిన అజయ్, 'డీమోంటీ కాలనీ' తర్వాత దానికి సీక్వెల్‌గా 'డీమోంటీ కాలనీ 2' చిత్రాన్ని తెరకెక్కించారు.

అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. మరోవైపు రాఘవ లారెన్స్ కూడా హార్రర్ జోనర్ సినిమాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఆయన నటించిన ‘కాంచన’ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో హార్రర్ సినిమాల్లో మంచి అనుభవం ఉన్న ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే అది ఈ జోనర్‌లో నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే రాఘవ లారెన్స్, అజయ్ జ్ఞానముత్తు మధ్య కథా చర్చలు జరిగినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story