Dulquer Salmaan: రేజ్ ఆఫ్ కాంత.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సాంగ్

by Chukka Sudharani |

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ డ్రామా 'కాంత'.

Dulquer Salmaan: రేజ్ ఆఫ్ కాంత.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సాంగ్
X

దిశ, సినిమా: వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ డ్రామా 'కాంత'. 1950 మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంగా.. సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తగా నిర్మిస్తున్న కాంత నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇదే జోష్‌లో రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ “కాంత” సినిమా నుండి ఎలాంటి ఎనర్జీ, ఇంటెన్సిటీని ఆశించవచ్చో చెప్పేస్తోంది. కాగా భారీ అంచనాల మధ్య ఈ మూవీ నవంబర్ 14న రిలీజ్ కానుంది.

Next Story