- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్ హీరోయిన్ రాధిక ఇంట తీవ్ర విషాదం..!
రాధిక శరత్ కుమార్ ( Radhika Sarathkumar ) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి గీత ఆదివారం అర్ధరాత్రి మరణించారు.

దిశ, వెబ్ డెస్క్ : చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖులను కోల్పోయింది ఇండస్ట్రీ. తాజాగా మరో విషాద సంఘటన ఇండస్ట్రీలో జరిగింది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ( Radhika Sarathkumar ) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి గీత ఆదివారం అర్ధరాత్రి మరణించారు. 86 సంవత్సరాలు ఉన్న రాధిక తల్లి గీత.. గత కొన్ని రోజులుగా ఆరోగ్యంతో బాధపడుతున్నారట.
అయితే ఆమె పరిస్థితి విషమించడంతో నిన్న మరణించినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు ఎం ఆర్ రాధ భార్య గీత అన్న సంగతి తెలిసిందే. ఆమె జీవితాన్ని... కుటుంబం, ప్రేమ, సామాజిక సేవలకు పూర్తిగా అంకితం చేశారు. ఇక రాధిక తల్లి గీత అంతక్రియలు సోమవారం సాయంత్రం బేసెంట్ నగర్ లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అటు ఆమె మృతి పట్ల సినీ వర్గాలు అలాగే అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.






