చిరంజీవి - మోహన్ లాల్ ఇద్దరిలో బెస్ట్ యాక్టర్ ఎవరు.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన రాధిక

by Pulgam srinivas |

రాధిక తాజాగా మాట్లాడుతూ... చిరంజీవి - మోహన్ లాల్ ఇద్దరిలో మోహన్ లాల్ బెస్ట్ నటుడు అని చెప్పుకొచ్చింది.

చిరంజీవి - మోహన్ లాల్ ఇద్దరిలో బెస్ట్ యాక్టర్ ఎవరు.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన రాధిక
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో చాలా సంవత్సరాల పాటు తిరుగులేని స్థాయిలో కెరీర్ను సాగించిన ముద్దుగుమ్మలలో సుహాసిని, రాధిక ముందు వరుసలో ఉంటారు. వీరు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమందితో నటించి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ కూడా వీరు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం సుహాసిని ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. దానికి రాధిక గెస్ట్ గా వచ్చింది.

ఈ టాక్ షోలో భాగంగా సుహాసిని, రాధికను కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడిగింది. దానికి రాధిక కూడా అదే స్థాయిలో ఆన్సర్స్ ఇచ్చింది. కానీ రాధిక చెప్పిన ఓ సమాధానం పట్ల మెగా ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. ఇంతకు ఎందుకు మెగా ఫ్యాన్స్ రాధిక చెప్పిన ఆన్సర్స్ విషయంలో ఫీలవుతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. సుహాసిని టాక్ షోలో భాగంగా రాధికను చిరంజీవి - మోహన్ లాల్ ఇద్దరిలో ఎవరి నటన అద్భుతంగా ఉంటుంది అని ప్రశ్నించింది. దానికి రాధిక, మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్ అని సమాధానం ఇచ్చింది.

అలాగే మోహన్ లాల్ గారు గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా అని ప్రశంసించింది. ఆ వెంటనే సుహాసిని, మోహన్ లాల్ - కమల్ హాసన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అని అడిగింది. దానికి రాధిక, కమల్ హాసన్ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కమల్ హాసన్ - శరత్ కుమార్ ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అని ప్రశ్నించింది. దానికి కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ అని సమాధానం ఇచ్చింది. ఇక చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో రాధిక నటించింది. కానీ ర్యాపిడ్ ప్రశ్నలలో మాత్రం చిరంజీవి కంటే మోహన్ లాల్ గొప్ప నటుడు అని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story