ధురంధర్‌ యాక్షన్‌పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. ఘాటుగా రిప్లై ఇస్తున్న నెటిజన్లు

by Ajay Maddhiboyina |

బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం ధురంధర్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఆదిత్య ధార్ సినిమాకు దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరించారు.

ధురంధర్‌ యాక్షన్‌పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. ఘాటుగా రిప్లై ఇస్తున్న నెటిజన్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం ధురంధర్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఆదిత్య ధార్ సినిమాకు దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్ పాండే, ఆదిత్యా ధార్ మరియు లోకేష్ ధార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తుండగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉందనే కారణంగా గల్ఫ్ కంట్రీస్ లో సినిమాను బ్యాన్ చేశారు. ఆరు గల్ఫ్ కంట్రీస్ లో ఈ సినిమా అసలు విడుదల కాలేదు.

మరోవైపు సినిమాపై కొంతమంది బాలీవుడ్ తారలు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బాలయ్య హీరోయిన్, బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ రాధికా అప్టే సైతం షాకింగ్ కామెంట్లు చేసింది. ఈ చిత్రం వల్ల తాను డిస్ట్రబ్ అయ్యానని పేర్కొంది. తాను బహిరంగంగా చెబుతున్నానని సినిమాలోని వయోలెన్స్ కారణంగా తాను చాలా డిస్ట్రబ్ అయ్యానని, ఎంటర్టైన్మెంట్ పేరుతో వయోలెన్స్‌ను అమ్ముతున్నారని చెప్పింది. అంతేకాకుండా ఇలాంటి వినోదంలో తన కుమారుడిని పెంచడం ఇష్టంలేదని పేర్కొంది. ఇలాంటివి తనవల్ల కాదని తెలిపింది. ఇక రాధిక చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ జనాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. రాధిక అప్టే నటించిన యాక్షన్ థ్రిలర్స్ పేర్లు చెబుతూ మరి ఇవి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Next Story