- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా 158లో ఛాన్స్ కొట్టేసిన రచితా రామ్.. హిట్ పడితే తెలుగులో దూసుకెళ్లడం ఖాయం
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’ సినిమాలో కీలక పాత్ర కోసం రచితా రామ్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాబి కొల్లి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మొదటగా హీరోయిన్ హనీ రోజ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే అనంతరం ఏమైందో తెలియదు గానీ, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో ఆమె కోసం అనుకున్న పాత్రలో మరో క్రేజీ బ్యూటీని మేకర్స్ ఫైనల్ చేసినట్లు సమాచారం. కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరైన రచితా రామ్‌ను హనీ రోజ్ పాత్రకు ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు రచితా రామ్ తెలుగులో నటించకపోవడంతో, ఈ సినిమా విజయవంతమైతే టాలీవుడ్‌లో ఆమెకు మంచి గుర్తింపు, క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






