- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకపై అలాంటి సినిమాలే చేస్తా..రాశిఖన్నా బోల్డ్ కామెంట్స్ !
రాశి ఖన్నా ఒకరు. 2013 సంవత్సరంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందాల తార, తెలుగులో ఊ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే, వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు వెళ్తుంటారు. అలాంటి వారిలో రాశి ఖన్నా ఒకరు. 2013 సంవత్సరంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందాల తార, తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత జోరు, జిల్, శివం, బెంగాల్ టైగర్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల సిద్దు జొన్నలగడ్డతో రొమాంటిక్ సినిమా కూడా చేశారు.
తెలుసు కదా అనే ప్రేమ కథ సినిమాలో రాశి ఖన్నా మెరిశారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఆమెకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే రాశి ఖన్నా ఇకపై కొత్త తరహా సినిమాలు చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపైన కంటెంట్ ఆధారిత పాత్రలు మాత్రమే చేయాలని డిసైడ్ అయినట్లు స్పష్టం చేశారు రాశి ఖన్నా. తాను సౌత్ ఇండియాలో చాలా కమర్షియల్ సినిమాలు చేసినట్లు గుర్తు చేశారు.
ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తన పాత్రకు బలం ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటునట్లు స్పష్టం చేశారు. కమర్షియల్ సినిమాలు చేయడం చాలా కష్టమే, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుందని చెప్పుకొచ్చారు. మనం సెలెక్ట్ చేసుకున్న పాత్రలో కంఫర్ట్ ఉండటం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆ పాత్ర వల్ల మనకు ఇబ్బంది ఉంటే, తప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని పేర్కొన్నారు రాశి ఖన్నా. కానీ దిగజారి రొమాంటిక్ సినిమాలు చేయబోనని తెలిపారు. అలాంటి పాత్రలు తన వద్దకు వస్తే వెంటనే నో చెప్పేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఇప్పుడు రాశి ఖన్నా చేస్తున్నారు.






