- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైడ్ వ్యూలో నడుమందాలతో మంత్రముగ్ధులను చేస్తున్న రాశి సింగ్
సైడ్ వ్యూలో నడుమందాల షో.. రాశి సింగ్ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటీ రాశి సింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ, 2021లో విడుదలైన శశి చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.
అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో రాశికి పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల వడ్డే నవీన్ హీరోగా తెరకెక్కిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రాశి సింగ్, ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఈ అందాల భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆరెంజ్ కలర్ చీరలో మెరిసిపోయిన రాశి, సైడ్ వ్యూలో తన నడుమందాలను హైలైట్ చేస్తూ ఇచ్చిన పోజులు అభిమానులను కట్టిపడేశాయి.
అందమైన ఇయర్ రింగ్స్, కొప్పులో పూలు, వెనక్కి వదిలేసిన జుట్టుతో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఓవరాల్‌గా ఈ ఫోటోల్లో రాశి సింగ్ అందం, అభినయం, గ్లామర్ కలిసి అభిమానులను ఫిదా చేయగా, నెటిజన్లు భారీగా లైక్స్, కామెంట్స్‌తో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






