Raashi Khanna: రాశీ ఖన్నాకు గాయాలు.. ఆందోళనలతో అభిమానులు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-20 06:58:49  IST  )

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రమాదానికి గురయ్యారు.

Raashi Khanna: రాశీ ఖన్నాకు గాయాలు.. ఆందోళనలతో అభిమానులు!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi kanna) ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె ఇవాళ సోషల్ మీడియా (Social media) ప్లాట్‌పామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఒక్కోసారి కథ డిమాండ్ చేస్తే గాయాలను కూడా లెక్క చేయకూడదంటూ చెప్పుకొచ్చారు. షూటింగ్‌లో చిన్న చిన్న గాయాలైనట్లు తెలుపుతూ అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోల్లో రాశీ ఖన్నా మొహంపై, చేతులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కాగా, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, రాశీ ఖ‌న్నా చివ‌రిగా అఘాతియా సినిమాలో క‌నిపించింది. అమ్మ‌డు ప్ర‌స్తుతం తెలుగులో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌తో క‌లిసి తెలుసు క‌దా సినిమాలో నటిస్తోన్నారు. అలాగే బాలీవుడ్ లో టీఎంఈ అనే యాక్ష‌న్ డ్రామాతో పాటు ఫర్జీ 2 వెబ్ సిరీస్‌లో నటిస్తోన్నారు.

Next Story