- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Birthday special: ‘మిమ్మల్ని దోచుకునేందుకు సిద్ధం..’ అంటూ రాశీఖన్నా కోసం స్పెషల్ పోస్ట్
‘డీజే టిల్లు’(DJ Tillu), ‘టిల్లు స్క్వేర్’(Tillu Square)తో సూపర్ సక్సెస్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) తాజా చిత్రం ‘తెలుసు కదా’(Thelusu Kada).

దిశ, సినిమా: ‘డీజే టిల్లు’(DJ Tillu), ‘టిల్లు స్క్వేర్’(Tillu Square)తో సూపర్ సక్సెస్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) తాజా చిత్రం ‘తెలుసు కదా’(Thelusu Kada). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన(Niraja Kona) దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి(Sreenidhi), రాశీఖన్నా(Rashi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కాగా.. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు రాశీఖన్నా పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘‘తెలుసు కదా’ టీమ్ ఎవర్ గార్జియస్ రాశీఖన్నాకు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. ఆమె తన యాక్టింగ్‌తో, హార్ట్‌తో మిమ్మల్ని దోచుకునేందుకు సిద్ధం అవుతోంది. మీరు ఆమె మ్యాజిక్‌ను ‘తెలుసు కదా’లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీగా ఉండండి.. పుట్టినరోజు శుభాకాంక్షలు రాశీ ఖన్నా’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్టర్‌లో రాశి.. చేతిలో డ్రింగ్ గ్లాస్ పట్టుకుని క్యూట్‌గా చూస్తోంది. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ కావడంతో.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.






