- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీ జీవితం ఈరోజు వేడుకలాగా రంగురంగులుగా ఆనందంగా ఉండాలి’.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఊహలు గుసగుసలాడే (uhalu gusagusalaḍe) సినిమాతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశీ ఖన్నా (Rashi Khanna).

దిశ, వెబ్‌డెస్క్: ఊహలు గుసగుసలాడే (uhalu gusagusalaḍe) సినిమాతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశీ ఖన్నా (Rashi Khanna). మొదటి మూవీతోనే ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత రాశీ ఖన్నా అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది.
తర్వాత బెంగాల్ టైగర్ (Bengal Tiger), శివం, సుప్రీమ్ (Supreme), జోరు (Joru), రాజా ది గ్రేట్ (Raja the Great), హైపర్ (Hyper) , టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శైత్కాన్కి, ఇమైక్కా నొడిగల్, అడంగా మారు, వెంకీ మామ (Venky mama), వరల్డ్ ఫేమస్ లవర్, శ్రీనివాస కళ్యాణం (Srinivasa Kalyanam), తిరు, పక్కా కమర్షియల్ వంటి తమిళ్, మలయాళం వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇకపోతే రాశీ ఖన్నా ఓ వైపు సినిమాల్లో బిజిబిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ స్టన్నింగ్ ఫొటో షూట్లతో అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తుంటుంది. ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ లుక్‌లో దర్శనమిస్తూ రాశీ ఖన్నా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటుంది. ఇకపోతే నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలు హోలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. సంతోషంలో మొత్తం రంగుల మయం చేసేశారు. ఎటు చూసినా రంగులే కనిపిస్తున్నాయి.
అయితే ఈ సందర్భంగా రాశీఖన్నా ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ మీ జీవితం ఈరోజు వేడుకలాగా రంగురంగులుగా, ఆనందంగా ఉండాలి. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు’’ అంటూ ఇంద్రధనుస్సు సింబల్ జోడించింది. అలాగే ఈ హీరోయిన్ పలు ఫొటోలు కూడా పంచుకుంది.
Read Also.. Betting Apps: సారీ.. తెలియక ప్రమోట్ చేశాను! కూతురు సుప్రీత.. సురేఖావాణి రియాక్షన్






