Betting Apps: సారీ.. తెలియక ప్రమోట్ చేశాను! కూతురు సుప్రీత.. సురేఖావాణి రియాక్షన్

by Ramesh Naini |   (  Updated:2025-03-15 06:12:51  IST  )

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

Betting Apps: సారీ.. తెలియక ప్రమోట్ చేశాను! కూతురు సుప్రీత.. సురేఖావాణి రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్స్ హాట్ టాపిక్‌గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలువురు సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం (Surekha Vani's daughter Supritha) నటి సురేఖ వాణి కూతురు సుప్రీత అలర్ట్ అయ్యి.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. కొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు తెలిసో.. తెలియకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారని.. అందులో తాను కూడా ఉన్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సారీ చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఎంకరేజ్ కావొద్దని, ఈజీ మనీకి అలవాటు పడొద్దని సూచించారు. బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేయాలని కోరారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని ఫాలో అవొద్దని తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఇస్టాగ్రామ్ వేదికగా శుక్రవారం నటి సురేఖావాణి (Surekhavani) సైతం బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయకండని సూచించారు. అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని అందరికీ సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు సైతం అలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయొద్దని కోరారు. ఈ వీడియోను (VC Sajjanar) ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు సురేఖ వాణి ట్యాగ్ చేశారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా ఇటీవల ఏపీకి చెందిన లోకల్ బాయ్ నాని (local Boy Nani) అనే యూట్యూబర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు (Youtuber Sunny Yadav) భయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక త్వరలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.

Read Also.. మీ హోలీ ఆనందం, ప్రేమ, రంగులతో నిండి ఉండనివ్వండి.. తెలుసు కదా నుంచి స్పెషల్ పోస్టర్

Betting Apps Promote: సుప్రీత చేసింది.. రైటా రాంగా..?.. ఆమె చేసింది ఎంత వరకు కరెక్ట్..?


Next Story