Raashi Khanna: ‘ఈ డ్రెస్ బాగుంది.. కానీ నా మైండ్ అలా లేదు.. వరుణ్ తేజ్ హీరోయిన్

by Kodari Anjali |

ఊహలు గుసగుసలాడే(Uhalu gusagusalaḍe) చిత్రంతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna).

Raashi Khanna: ‘ఈ డ్రెస్ బాగుంది.. కానీ నా మైండ్ అలా లేదు.. వరుణ్ తేజ్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఊహలు గుసగుసలాడే(Uhalu gusagusalaḍe) చిత్రంతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna). మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది. తర్వాత బెంగాల్ టైగర్(Bengal Tiger), జోరు, శివం, సుప్రీమ్(Supreme) , రాజా ది గ్రేట్(Raja the Great), హైపర్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శైత్కాన్కి బచ్చా, ఇమైక్కా నొడిగల్(Imaikka Nodigal), అడంగా మారు, వెంకీ మామ, శ్రీనివాస కళ్యాణం, వరల్డ్ ఫేమస్ లవర్(World Famous Lover), తిరు(Thiru), పక్కా కమర్షియల్, వంటి తెలుగు, మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటించి.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో బిజి బిజిగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

తరచూ స్టన్నింగ్ ఫొటో షూట్లతో అభిమానుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. ఒక్కోసారి ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమివ్వగా.. ఒక్కోసారి మోడ్రన్‌ లుక్‌లో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్.. కళ్లకు అద్దాలు పెట్టుకుని కిర్రాక్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలకు రాశీ ఖన్నా ఓ క్యాప్షన్ కూడా జతచేసింది.‘‘ఈ డ్రెస్ బాగానే ఉంది, కానీ నా మెదడు అలా లేదు. ఒక క్యాప్షన్ ఇవ్వండి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story