- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఫుడ్ కోమాతో పగటి కలలు కంటున్నాను’.. విజయ్ దేవరకొండ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా (Rashi Khanna) ప్రజెంట్ కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా (Rashi Khanna) ప్రజెంట్ కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుంది. ‘ది సబర్మతీ రిపోర్ట్’ (The Sabarmati Report), ‘అరణ్మనై 4’ (Aranmanai) లాంటి సినిమాలతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాశి ఖన్నా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇకపోతే హీరోయిన్ తన కెరీర్ ఎదుగుదలకు సహాయపడే సినిమాలపై దృష్టి సారిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కూడా.
ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ తన ప్రతిభ చాటుతోంది. ఇటీవలే ది సబర్మతీ రిపోర్ట్ అనే బాలీవుడ్ సినిమాలో నటించి.. అక్కడి ప్రేక్షకులతో ప్రశంసలు అందుకుందని చెప్పుకోవచ్చు. ఈ అందాల ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి అభిమానుల్ని అలరిస్తుంది. రాశి ఖన్నా ఫర్జీ (Pharji) అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది. తెలుగులో ఊహలు గుసగుసలాడే (Uhalu gusagusalaḍe) చిత్రంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) సరసన తెలుసు కదా (Telusu kadA) మూవీలో నటిస్తోంది. తెలుసు కదా సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ , రాశి ఖన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.
ఇకపోతే రాశి ఖన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్ లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్ పంచుకుంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. భోజనం ముందు కూర్చుని హ్యాపీ మూడ్‌లోకి వెళ్లిన పిక్, మరిన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో ఉన్నవి, తింటోన్న ఫొటోలను రాశి పంచుకుంది. అంతేకాకుండా ఈ పిక్స్‌కు ‘ఫుడ్ కోమాతో పగటి కలలు కంటున్నాను’ అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
Read More..
Sneha: చీకటి గది.. బ్లాక్ శారీలో సీనియర్ స్టార్ నటి ఖతర్నాక్ ఫోజులు!






