Raashi Khanna : అభిమానితో డేటింగ్‌కు మీరు సిద్ధమా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన రాశీ ఖన్నా

by Chukka Sudharani |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీఖన్నా.. ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది.

Raashi Khanna : అభిమానితో డేటింగ్‌కు మీరు సిద్ధమా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన రాశీ ఖన్నా
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీఖన్నా.. ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది. ఇటీవల ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. త్వరలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రవి శంకర్, చేకూరి మోహన్‌ నిర్మించారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ బ్రాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాశీ ఖన్నా.. ఫ్యాన్స్‌తో డేట్‌పై అలాగే హీరోల రెమ్యునరేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘మీరు ఫ్యాన్‌తో డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?’ అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘నేను అలా అనుకోను.. అభిమానులు మమ్మల్ని ఒక పెద్ద పీఠంపై ఉంచుతారు. అయితే.. మనం దూరం నుంచి చూసినప్పుడు ఒకలా.. అలాగే కలిసినప్పుడు వారిపై మనకు ఉన్న ఇమేజ్ మరోలా మారవచ్చు. కాబట్టి ఏ అభిమానం అయినా దూరం నుంచే బాగుంటుంది అని నా అభిప్రాయం.. అదే అభిమానికి మంచిదని నేను భావిస్తున్నాను’ అని తెలిపింది. ఇక హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు మధ్య వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుంది. హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఉండటం అనేది చాలా సాధారణం. అయితే.. సెట్‌లో మహిళలను సమానంగా చూడాలి అనేది నా ఉద్దేశం’ అని తెలిపింది.

Next Story