- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa2: ‘పుష్ప 2’ మూవీలో అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ ఎక్కడిదో తెలుసా.. ఆ స్పెషల్ ప్లేస్‌లోనిదే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అయితే ‘పుష్ప 2’(Pushpa 2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 829 కోట్లు కలెక్ట్ చేసి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘పుష్ప 2’ సినిమాలో కొన్ని చోట్ల క్యాస్టూమ్స్‌గా పోచంపల్లి వస్త్రాలు మెరిశాయి. పోలీస్ ఆఫీసర్‌గా బన్వర్ సింగ్ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటూ చెప్పే డైలాగ్‌లో హీరో అల్లు అర్జున్ ధరించిన చొక్కా పోచంపల్లి ఇక్కత్ చొక్కానే. అయితే పోచంపల్లిలో షూటింగ్ సమయంలో ఈ షర్ట్ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






