- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌లో పుష్ప క్రేజ్ "తగ్గేదే లే"..జాన్ అబ్రహంతో పుష్ప అభిమాని వీడియో వైరల్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సూపర్ హిట్‌గా నిలిచిందో తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సూపర్ హిట్‌గా నిలిచిందో తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ చిత్రానికి తెలుగు కంటే బాలీవుడ్‌లో మరింత ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ ప్రేక్షకులు సినిమాకు ఫిదా అయ్యారు. పార్ట్ 1 మరియు పార్ట్ 2లకు అక్కడ భారీగా కలెక్షన్స్ వచ్చాయి.
ఇక ఇప్పటికీ సినిమాను అక్కడి ప్రేక్షకులు, అభిమానులు మర్చిపోకపోవడం ఆశ్చర్యకరం. తాజాగా ఓ అభిమాని పుష్ప గెటప్‌లో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం వద్దకు వెళ్లి డైలాగులు చెప్పాడు. పుష్ప గెటప్ లో వెళ్లిన అభిమాని అచ్చం సినిమాలో అల్లు అర్జున్ మాధిరిగానే నటించడంతో జాన్ ఆశ్చర్యపోయారు. అతడి నటన చూసి అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో బాలీవుడ్‌లో పుష్ప క్రేజ్ తగ్గలేదని బన్నీ అభిమానులు కుషీ అవుతున్నారు. వీడియో






