రజినీకాంత్ ‘జైలర్-2’లో మలయాళ స్టార్ హీరో.. ఉత్కంఠను రేకెత్తిస్తోన్న ట్వీట్

by Mallepaka Hamsa |

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. గత ఏడాది ‘వెట్టైయాన్’ సినిమాతో వచ్చిన ఆయన పెద్దగా మెప్పించలేకపోయాడు.

రజినీకాంత్ ‘జైలర్-2’లో మలయాళ స్టార్ హీరో.. ఉత్కంఠను రేకెత్తిస్తోన్న ట్వీట్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. గత ఏడాది ‘వెట్టైయాన్’ సినిమాతో వచ్చిన ఆయన పెద్దగా మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం సూపర్ ‘కూలీ, జైలర్-2(Jailer-2) వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ ‘జైలర్’కు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో మొదటి పార్ట్‌లో నటించిన నటీనటులు వసంత్ రవి, మీర్నా మీనన్, యోగిబాబు, వినాయకన్, శివరాజ్ కుమార్(Shivaraj Kumar), మోహన్ లాల్ వంటి వారు నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా2025 మార్చిలో విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ పూర్తి కానందున వాయిదా పడింది.

వచ్చే ఏడాది దీపావళి కానుకగా జైలర్-2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైనవన్నీ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. మూవీ మేకర్స్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, జైలర్-2లో ఓ స్టార్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. పుష్ప-2 చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ జైలర్-2లో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. అసలు ఇందులో ఆయన విలన్‌గా నటిస్తున్నాడా.. లేక గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. మొత్తానికి జైలర్-2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story