- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుష్ప 3 లో విజయ్ లుక్స్ వైరల్..సుకుమార్ ప్లాన్ అదుర్స్!
విజయ్ దేవరకొండ కూడా నటిస్తాడని తెలుస్తోంది. పార్ట్ 3 లో పోలీసులకు అల్లు అర్జున్ పట్టుబడితే, క్యామియో రోల్ లో విజయ్

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. పుష్ప, పుష్ప 2 రెండు సినిమాలు కూడా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేశాయి. ఇక ఇప్పుడు పుష్ప 3 సినిమా ఎప్పుడు వస్తుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా రావడం మాత్రం గ్యారంటీ అంటున్నారు సినిమా విశ్లేషకులు. 2028లో వచ్చే ఛాన్సులు ఉన్నాయట. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది అని కూడా చెబుతున్నారు. పుష్ప ది రాంపేజ్ పేరుతో పార్ట్ 3 వస్తుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో తాను సంపాదించుకున్న ఆస్తులను జనాలందరికీ పుష్ప పని చేస్తాడట.
అలాగే అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ చేయడాన్ని ఈ సినిమాలో చూపిస్తారట. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా నటిస్తాడని తెలుస్తోంది. పార్ట్ 3 లో పోలీసులకు అల్లు అర్జున్ పట్టుబడితే, క్యామియో రోల్ లో విజయ్ దేవరకొండ వస్తాడని టాక్ వినిపిస్తోంది. అలా విజయ్ దేవరకొండ వచ్చి.. పుష్పను కాపాడుతాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు కానీ సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు.. దీనికి సంబంధించిన వీడియోను కూడా రూపొందించి వైరల్ చేస్తున్నారు. పార్ట్ 3 లో విజయ్ దేవరకొండ నటించినట్లు ఒక క్రేజీ వీడియోను కూడా పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. క్లిక్






