- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప-2.. స్పెషల్ ప్రోమో రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప-2' నేటితో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప-2' నేటితో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక విడుదలైన రోజు నుంచి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అనేక రికార్డులను బద్దలుకొట్టింది. ఇప్పటి వరకూ ఈ మూవీ భారత్‌లో రూ.1230.55 కోట్లు (నెట్) వసూలు చేసిన ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి2’ కలెక్షన్లను సైతం ‘పుష్ప2’ అధిగమించింది. రూ.1800 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త ప్రోమోను విడుదల చేశారు.
ఇక బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్న 'పుష్ప2' OTT విడుదలకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలైన రోజు నుంచి 56 రోజుల కన్నా ముందు ఏ ఓటీటీలోనూ 'పుష్ప2' స్ట్రీమింగ్ కాదని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెలాఖరుకు ఈ సినిమా విడుదలై 56 రోజులు పూర్తవుతాయి. అంటే జనవరి 31న ‘పుష్ప2’ను స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారేమో చూడాలి. ఇక నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర స్ట్రీమింగ్‌రైట్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు.






