- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa2Reloaded: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ గింప్ల్స్.. వైల్డ్‌ఫైర్ ను ఎక్స్‌ట్రా ఫైర్ గా మార్చేసిన చిత్ర బృందం
నేడు పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ గింప్ల్స్ ను అల్లు అర్జున్ ఎక్స్ (X) వేదికగా రిలీజ్ చేశాడు

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) డిసెంబర్ 5న విడుదలయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ రికార్డులన్నీ బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.1831 కోట్లకి పైగా కలెక్ట్ చేసి ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసినట్టు ‘మైత్రి మూవీ మేకర్స్’ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. అయితే, అన్నింటి కంటే నార్త్ లో ‘పుష్ప 2’ కి ఎవరూ ఊహించలేని రెస్పాన్స్ వచ్చింది. ఇది ఈ సినిమాకి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి.
ఇక, ఇప్పుడు పుష్ప-2 ది రూల్ మరో సారి హాట్‌టాపిక్‌గా మారింది. జనవరి 17 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్.. మరో ఇరవై నిమిషాల సీన్స్ ను యాడ్ చేయబోతున్నారు. అంటే ది వైల్డ్‌ఫైర్ గా ఉన్నది ఎక్స్‌ట్రా ఫైర్ గా మన ముందుకు రాబోతుంది. నేడు దీనికి సంబంధించిన గింప్ల్స్ అల్లు అర్జున్ ఎక్స్ (X) వేదికగా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.






