- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్‌లో పుష్ప-2 రిలీజ్.. డిఫరెంట్ క్యాప్షన్‌తో రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2 సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2 సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప-2 మూవీలో రష్మిక మందన్న కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 జపాన్‌లో కూడా రిలీజ్ కానుంది. ఈ మేరకు తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 16వ తేదీన జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు రిసెంట్‌గా చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో భాగంగా పుష్ప 2 మూవీని ‘పుష్ప కున్రిన్’ అనే టైటిల్‌తో జపాన్ భాషలో విడుదల చేయనుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ జపానీస్ పోస్టర్ తో పాటు ట్రైలర్ కూడా విడుదల చేసింది.
ఈ తరుణంలో.. జపాన్ లో పుష్ప-2 మూవీ రిలీజ్ కాబోతుండటం పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. పుష్ప నూతన సంవత్సరంలో జనవరి 16 వ తేదీన జపాన్ లో అడుగుపెట్టబోతోంది.. మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ పోస్ట్ పెట్టింది. అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, అర్య సుక్కు, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మేకర్స్, పుష్ప_కున్రిన్ అని ట్యాగ్ చేసింది. జపాన్ లో పుష్ప 2 విడుదలకు సిద్ధమవడం పై ఈ సినిమాను భారీగా ఆదరిస్తారనే నమ్మకం ఉందని మైత్రీ మూవీస్ నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ట్వీట్ ఇదే






