- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీసు వద్ద ‘పుష్ప 2’ హిందీ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..? (పోస్ట్)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అయితే ‘పుష్ప 2’(Pushpa 2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇదిలా ఉంటే.. పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సత్తా చాటుతుంది. ముఖ్యంగా హిందీలో ‘పుష్ప 2’ వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. తెలుగుతో సమానంగా పుష్ప 2 హిందీ కలెక్షన్లు వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా పుష్ప 2 ఐదో రోజు హిందీ కలెక్షన్స్ ఎంతో ఓ పోస్ట్ షేర్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ పోస్టర్‌లో భాగంగా.. ఐదో రోజు హిందీలో రూ.48 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. మొదటి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ.59 కోట్లు, మూడవ రోజు రూ.74 కోట్లు, నాలుగో రోజు రూ.86 కోట్లు, ఇక ఈరోజు అనగా ఐదో రోజు రూ.48 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అయితే ఓవర్ ఆల్‌గా చూస్తే ఐదు రోజులు కలిపి రూ. 339 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి రికార్డుకెక్కింది పుష్ప 2. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More...
వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో.. దుమారం రేపుతున్న రాజేంద్రప్రసాద్ కామెంట్స్






