- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తూ ‘పుష్ప-2’ నటుడు స్పెషల్ పోస్ట్.. ఎక్కడ, ఎప్పుడు జరగనుందంటే?
ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు.

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్‌గా మారిన డాలీ ధనుంజయ్(Dhanunjay) కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ మూవీలో జాలిరెడ్డిగా నటించి తన విలనిజం చూపించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఆయన.. ధన్యత(Dhanyatha) అనే అమ్మాయిని ప్రేమించి సంగతి తెలిసిందే. కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరగనుంది.
ఈ విషయాన్ని తెలుపుతూ ధనుంజయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు. తను క్లాప్ కొట్టే బోర్డ్‌తో కనిపించగా.. తన భార్య డాక్టర్‌గా చెతస్కోప్ పట్టుకుని ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. అయితే వీరిద్దరు మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఊరు కావడంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. మాత చాముండేశ్వరి అనుగ్రహంతో పెళ్లి వేదికను సిద్ధ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ధనుంజయ్‌కు కాబోయే భార్య విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ధన్యత గైనకాలజీలో స్పెషలిస్ట్ అని తెలుస్తోంది. వీరిద్దరికి చాలా క్రితం నుంచే పరిచయం ఉన్నట్లు సమాచారం. అది కాస్త ప్రేమగా మారడంతో త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాబోతున్నారు.






