- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సై ఫై థ్రిల్లర్ మూవీ నుంచి ఫస్ట్ టైమ్ హీరో పోస్టర్ రిలీజ్..
‘గుప్పెడంత’ ఫేమ్ జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సై ఫై థ్రిల్లర్ చిత్రం ‘కిల్లర్’.

దిశ, సినిమా: ‘గుప్పెడంత’ ఫేమ్ జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సై ఫై థ్రిల్లర్ చిత్రం ‘కిల్లర్’. పూర్వాజ్ హీరోగా నటిస్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్న ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతుండగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి టీజర్ వరకు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న పూర్వజ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫస్ట్ టైమ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పూర్వజ్ వేలు చూపిస్తూ సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చాడు.






