ఆకట్టుకుంటున్న ‘పురుష:’ టీజర్..

by Sujitha Rachapalli |

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా ‘పురుష:’. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఆకట్టుకుంటున్న ‘పురుష:’ టీజర్..
X

దిశ, సినిమా : బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా ‘పురుష:’. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా.. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలలో కనిపించనున్న మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ టీజర్ రిలీజ్ చేసి.. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పారు.

టీజర్ విషయానికొస్తే.. ప్రతి సీన్‌లో కామెడీ టచ్ ఉండేలా చూసుకుంది చిత్ర యూనిట్. ఏ దినము చూసినా షాపింగ్.. షాపింగ్.. షాపింగ్.. అది మా దినముకి వచ్చుచున్నది అంటూ సప్తగిరి చెప్పిన డైలాగ్ నేటితరం భార్యాభర్తల తీరును చెప్పేలా ఉంది. మగజాతి గర్వించదగ్గ ఆణిముత్యాలండీ మీరు.. అని పేర్కొంటూ టీజర్ ముగించారు. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ అని ఈ టీజర్ ద్వారా తెలిపారు. పెళ్లి, ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే కోణంలో కామెడీని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారని అర్థమవుతోంది.

Next Story