‘ఏంటో అంతా సరికొత్తగా’ అంటున్న పూరి జగన్నాథ్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by Chukka Sudharani |

అద్భుతమైన చిత్రాలకు ప్రేక్షకుల ఆధారణ ఎప్పుడు దక్కతుంది.

‘ఏంటో అంతా సరికొత్తగా’ అంటున్న పూరి జగన్నాథ్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: అద్భుతమైన చిత్రాలకు ప్రేక్షకుల ఆధారణ ఎప్పుడు దక్కతుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్రామీణ వాతావరణంలో అందమైన ప్రేమ కథగా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఏంటో అంతా సరికొత్తగా’. రాము ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాము.ఎం నిర్మాతగా రాజ్ బోను తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, హర్షిత జంటగా నటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. ‘ఏంటో అంతా సరికొత్తగా’ టైటిల్‌కు తగ్గట్టుగా ఈ చిత్రంలోని బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంటుందని హామి ఇస్తున్నారు మేకర్స్.

ఈ చిత్రంలో హీరో, అతని స్నేహితులు టోల్ గేట్ వద్ద పని చేస్తుంటారు. గ్రామీణ వాతావరణం, టోల్ గేట్ వద్ద జరిగే సంఘటనలు చూపిస్తూ అందమైన ప్రేమను తెరపై ఆవిష్కరించబోతోన్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఎంతో కూల్‌గా కనిపిస్తుండగా.. అన్ని రకాల అంశాలను ఇందులో జోడించినట్లు తెలుస్తుంది. అపురూపమైన ప్రేమ కథగా ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్న ‘ఏంటో అంతా సరికొత్తగా’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు టీమ్. ఇందులో శ్రీనివాస్ భోగి రెడ్డి, ఎఫ్ఎం బాబాయ్, భద్రం, రాములు, మహదేవ్, భరత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story