మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఒకే ఒక్కడు పూరి జగన్నాథ్.. ఎలానో తెలుసా.?

by Pulgam srinivas |

మహేష్ నమ్మి రెండవసారి సినిమా చేసే అవకాశం ఇస్తే, అందులో పూరి జగన్నాథ్ ఒక్కరే పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలతో విజయాలను అందించాడు.

మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఒకే ఒక్కడు పూరి జగన్నాథ్.. ఎలానో తెలుసా.?
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు చాలామంది దర్శకులను నమ్మితే అందులో పూరి జగన్నాథ్ ఒక్కరే ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అది ఎందులో అనుకుంటున్నారా? మహేష్ నమ్మి రెండవ సినిమా అవకాశం ఇస్తే దానిని సక్సెస్ చేసే విషయంలో ఆయన ఒక్కరే మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మహేష్‌కి ఒక్కడు సినిమాతో గుణశేఖర్ అద్భుతమైన విజయాన్ని అందించాడు.

ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో సైనికుడు, అర్జున్ అనే రెండు సినిమాలు చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. శ్రీను వైట్ల, మహేష్ బాబుతో మొదటగా దూకుడు సినిమా చేశాడు. ఇది బ్లాక్బస్టర్ అయ్యింది. ఆ తర్వాత మహేష్, శ్రీను వైట్లను నమ్మి ఆగడుతో రెండవ అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఇక శ్రీకాంత్ అడ్డాల కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మహేష్‌కు మంచి విజయం అందించాడు.

ఆ తర్వాత ఆయన బ్రహ్మోత్సవం అనే చిత్రాన్ని రూపొందించి మహేష్‌కి భారీ ఫ్లాప్ ను అందించాడు. మహేష్, పూరి జగన్నాథ్ కాంబోలో మొదటగా పోకిరి అనే సినిమా వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీకి హిట్ను అందించింది. ఆ తర్వాత మహేష్ మళ్ళీ బిజినెస్ మాన్ చిత్రంతో పూరి జగన్నాథ్ కి రెండవ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న వారిలో పూరి జగన్నాథ్ ఒకే ఒక్కడుగా నిలిచాడు.

Next Story