మొగుళ్లు ఏం చేసినా పెళ్లాలు సర్దుకుపోవాలి.. వివాదాస్పదంగా పూరీ కామెంట్స్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పూరీ జగన్నాథ్ చాలా ఆడియోలను విడుదల చేశారు.

మొగుళ్లు ఏం చేసినా పెళ్లాలు సర్దుకుపోవాలి.. వివాదాస్పదంగా పూరీ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పూరీ జగన్నాథ్ చాలా ఆడియోలను విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఆయన భార్య భర్తల సంసారానికి సంబంధించి చేసిన ఓ ఆడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పూరీ జగన్నాథ్ ఈ ఆడియోలో భర్తలు ఏం చేసినా భార్యలు సర్దుకుపోవాలి అన్నట్టు మాట్లాడారు. ఆఖరికి దేవుడిని పెళ్లి చేసుకున్నా అంతేనని వ్యాఖ్యానించారు. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి, తల్లి ఉండొచ్చని, పర్ఫెక్ట్ డ్రైవర్, పర్ఫెక్ట్ డాక్టర్, నర్సు దొరుకుతారేమో కానీ పర్ఫెక్ట్ భర్త మాత్రం ఉండరని అన్నారు. నా భర్తకు ఇలాంటి క్వాలిటీలే ఉండాలని ఎంతపెద్ద లిస్ట్ రాసుకుంటే అంత బాధపడతారని అన్నారు.

జీవితంలో చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారని, అందులో ఎక్కువగా ఏడిపించే అవకాశం మొగుడికే ఉంటుందన్నారు. జీవితాంతం పక్కనే ఉంటాడు కాబట్టి ఆ అవకాశం ఉంటుందన్నారు. మీ నాన్న తప్పు చేస్తే మీ అమ్మ క్షమించినట్టే మీరూ క్షమించండని చెప్పారు. రాముడితో సహా ప్రతి దేవుడు తన భార్యను ఏడ్పించినవాడే అని వ్యాఖ్యానించారు. మీకు ఏడవడం ప్రారంభిస్తే ప్రతిఒక్కరూ ఏడిపిస్తారని అన్నారు. మీకు ఆ మాత్రం ఏడుపులు భర్త లేకపోయినా ఉంటాయని వ్యాఖ్యానించారు. మీ కంట్లో కన్నీళ్లు చూడకుంటే పక్కంటి వదినకు అస్సలు నచ్చదు కాబట్టి ఆమె చెప్పే మాటలు విని మీ భర్తతో గొడవపడొద్దని అన్నారు.

Next Story