Sairam Shankar : 25 కుక్కలతో ఫైట్ చేసిన పూరి జగన్నాథ్, తమ్ముడు.. జస్ట్ మిస్.. లేదంటే కుక్కలన్నీ కరిచేవి!

by Phanindra |   (  Updated:2025-02-05 03:26:28  IST  )

ఈ హీరో ఇప్పుడు ‘ఒక పథకం ప్రకారం’ అనే మూవీతో రాబోతున్నాడు.

Sairam Shankar : 25 కుక్కలతో  ఫైట్ చేసిన పూరి జగన్నాథ్, తమ్ముడు.. జస్ట్ మిస్.. లేదంటే కుక్కలన్నీ కరిచేవి!
X

దిశ, వెబ్ డెస్క్ : పూరి జగన్నాధ్ తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై తన సినిమాలతో హిట్స్ సాధించిన సాయి రామ్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, తర్వాత వరుస ఫ్లాప్స్ రావడంతో కొంత కాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బిజీ అయ్యాడు. కొన్ని నెలల క్రితం " వెయ్ దరువేయ్" అనే సినిమాతో పలకరించిన ఈ హీరో ఇప్పుడు ‘ఒక పథకం ప్రకారం’ అనే మూవీతో రాబోతున్నాడు.

మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ డైరెక్షన్ లో గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మాణంలో తెరకెక్కిన " ఒక పథకం ప్రకారం " చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ మూవీలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు సాయిరాం శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

ఈ చిత్రంలో ఇంటర్వెల్ సమయానికి విలన్ ఎవరొ కనిపెడితే పదివేలు ఇస్తామని ఇప్పటికే ప్రమోషన్స్ చేశారు. దాని గురించి మాట్లాడుతూ.. " క్లైమాక్స్ షూటింగ్ కోసం 25 కుక్కలు తెచ్చాము. ఆ క్లైమాక్స్ ఒక్కటే 4 రోజులు షూట్ చేసాము. ఓ సమయంలో డాగ్ పైకి రావడంతో అక్కడున్న గ్రిల్ ఎక్కేశాను. లేకపోతే అవి నన్ను కరిచేవి. అసలే అవి మాములు కుక్కలు కూడా కావు. ఇక సినిమాకి ఒక ఆఫర్ పెట్టాము.. దీని వలన మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పేరు, రిలీజ్ అవుతుందన్న విషయం చాలా మందికి తెలుస్తుంది. మొదటి నుంచి ఇదొక్కటి బాగా అనుకున్నాం. సినిమా చూశాక మా యూనిట్‌లో కొందరు " పట్టుకుంటే పదివేలు " అని చెప్పడంతో ఇంక ఇది ఫిక్స్ అయ్యాము. మొత్తం 50 సెంటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 50 సెంటర్స్ లో ఆఫర్ ఉంటుంది. అక్కడ ఉండే బాక్స్ లో ఇంటర్వెల్ లోపు సినిమాలో విలన్ ఎవరనేది రాసి వేయాలి. కరెక్ట్ సమాధానం చెప్పిన వెంటనే వారికి పదివేలు సాయి రామ్ శంకర్ ఇస్తామని తెలిపారు.

మలయాళంలో హిట్స్ కొట్టి, అవార్డులు అందుకున్న డైరెక్టర్ వినోద్ విజయన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. డైరెక్టర్ గురించి సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. " 17 ఏళ్లకే ఆయన సినీ సినిమాల్లోకి వచ్చాడు. నా మొదటి మూవీ తర్వాత నుంచి నాకు మంచి స్నేహితుడు. 2005 నుంచే మేము ఒక సినిమా చేద్దామనుకున్నాం అది ఇప్పటికి కుదిరింది. ఇతనికి అన్నిటి మీద అవగాహన ఉంది. దర్శకనిర్మాతగా ఫాహద్ ఫాజిల్ తో రెండు సినిమాలు చేశారు. మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ వినీత్ కూడా ఓ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఈ మూవీ మొదలైందని " చెప్పారు.

Next Story