pujita.ponnada: నిన్నటి ట్రిప్ క్లోజప్ షాట్లు పంచుకున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Kodari Anjali |

తెలుగు సినిమా నటి అయిన పూజిత పొన్నాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

pujita.ponnada: నిన్నటి ట్రిప్ క్లోజప్ షాట్లు పంచుకున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా నటి అయిన పూజిత పొన్నాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు ‘రంగస్థలం, 2019లో కల్కి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 2018లో వచ్చిన "రంగస్థలం" చిత్రంలో ఆది పినిశెట్టి ప్రియురాలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2015లో ఉప్మా తినేసింది అనే లఘుచిత్రంతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది.

తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు లభించాయి. ఊపిరి, దర్శకుడు, రంగస్థలం, రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ, రన్, మిస్ ఇండియా, మ‌నిషి, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్, ఆకాశ వీధుల్లో, రావణాసుర వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. పూజిత పొన్నాడ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తుంటుంది.

ఇకపోతే తాజాగా ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నిన్నటి ట్రిప్ క్లోజప్ షాట్లు’’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చి బ్యూటిఫుల్ పిక్స్ పంచుకుంది. ఈ పోస్ట్ వీక్షించినా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. లుకింగ్ సో బ్యూటిపుల్, అద్భుతమైన ప్రదేశంలో అద్భుతమైన షాట్, అద్భుతమైన చిరునవ్వు, అందమైన హెయిర్ స్టైల్.. నిజంగా చాలా చాలా హాట్ గా ఉంది.. అందమైన దుస్తుల్లో సూపర్ అంటూ అభిమానులు ఈ బ్యూటీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Next Story