- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షాకాలంలో ఆ డేట్స్ బెస్ట్ అంటూ హీరోయిన్ క్రేజీ పోస్ట్..
నటి పూజిత పొన్నాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: నటి పూజిత పొన్నాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొందింది. ఈమె నారా రోహిత్ నటించిన తుంటరి చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన నటనకు మంచి పేరు దక్కింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా అయిన రంగస్థలంలో అవకాశం కొట్టేసింది. ఈ నటికి గుర్తింపు వచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ చిత్రం కల్కిలో నటించింది. ఏకంగా ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో చాన్స్ సంపాదించుకోవడం విశేషం. వీటితో పాటు ఈ హీరోయిన్ రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, సెవెన్, కథ కంచికి మనం ఇంటికి, ఊపిరి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది.
ఇకపోతే పూజిత పొన్నాడ తరచుగా సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె అందం, నటన కారణంగా నెట్టింట ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటుంది. ముఖ్యంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్షాకాలంలో వచ్చే సడెన్ కాఫీ డేట్స్ ఉత్తమంగా అనిపిస్తాయంటూ ఓ పోస్ట్ పెట్టింది. అలాగే క్యూట్ ఫొటోలు కూడా పంచుకుంది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్ల చేస్తున్నారు.






