- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైకలాజికల్ థ్రిల్లర్ ‘శారీ’ ట్రైలర్‌తోనే హైప్ పెంచేసిన ఆర్జీవీ..
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఒకప్పుడు పలు హిట్ చిత్రాలు తెరకెక్కించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఒకప్పుడు పలు హిట్ చిత్రాలు తెరకెక్కించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయిన ఆయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం పలు విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని సంఘటనపై తనదైన స్టైల్లో రియాక్ట్ అయి దుమారం రేపుతున్నారు. అయితే ఇటీవల ఆర్జీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో చీర కట్టుకుని కనిపించిన అమ్మాయికి ఫిదా అయిపోయారు. దీంతో ఆమెతో ‘శారీ’(Saree) సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆమెకు ఆరాధ్య దేవి అనే పేరు కూడా పెట్టారు.
అయితే ఈ మూవీ నిజజీవిత సంఘటనల ఆధారంగా గిరీశ్ కృష్ణ కమల్(Girish Krishna Kamal) తెరకెక్కిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ‘శారీ’చిత్రాన్ని ఆర్జీవీ ప్రొడక్షన్ బ్యానర్స్‌లో రవివర్మ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 28న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. నిత్యం ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూ ‘శారీ’చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తున్నారు. తాజాగా, ఆర్జీవీ తన ట్విట్టర్ ద్వారా ‘శారీ’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇందులో శారీలో కనిపించని ఆరాధ్య దేవిని ఓ కిల్లర్ ప్రేమించినట్లు టార్గెట్ చేసి వేధిస్తుంటాడు. ఆ తర్వాత అతని జీవిత ఎంత భయానకంగా మారింది అన్నదే ఇందులో చూపించారు. అలాగే ఒక వ్యక్తికి ప్రేమ ఎక్కువైతే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి అనేది మరీ వైల్డ్‌గా చూపించారు. ప్రస్తుతం ‘శారీ’ ట్రైలర్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది.






