- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ రోజు కోసం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. యంగ్ హీరో ఎమోషనల్
యంగ్ హీరో శ్రీ నందు న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్ ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాను స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు.

దిశ, సినిమా : యంగ్ హీరో శ్రీ నందు న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్ ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాను స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించారు. సురేష్ ప్రొడక్షన్ ద్వారా జనవరి 1న గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో శ్రీ నందు.. ఈరోజు కోసమే 18 ఏళ్లుగా ఎదురు చూసినట్లు చెప్పాడు. ఒక బ్లాక్ బస్టర్ పోస్టర్‌తో మీ అందరి ముందు మాట్లాడాలని, సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌కి థాంక్స్ చెప్పాలని కోరుకున్నానని.. ఈ రోజు నెరవేరడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. డైరెక్టర్ వరుణ్‌కే సినిమా సక్సెస్ క్రెడిట్ దక్కుతుందన్నాడు.






