టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడ్డ అమ్మాయి.. బ్రేకప్‌ చేసుకున్న అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకుంటే..

by Sujitha Rachapalli |

నందు హీరోగా వస్తున్న ‘సైక్ సిద్ధార్థ’లో వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమన్ క్యారెక్టర్ చేశానని చెప్పింది యామినీ భాస్కర్. ఈ చిత్రం అందరికీ రిలేట్ అవుతుందని.. అవుట్ పుట్ అందరికీ నచ్చుతుందని తెలిపింది. ఈ మూవీ ట్రైలర్, పోస్టర్లు చూసి ‘

టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడ్డ అమ్మాయి.. బ్రేకప్‌ చేసుకున్న అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకుంటే..
X

దిశ, సినిమా : నందు హీరోగా వస్తున్న ‘సైక్ సిద్ధార్థ’లో వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమన్ క్యారెక్టర్ చేశానని చెప్పింది యామినీ భాస్కర్. ఈ చిత్రం అందరికీ రిలేట్ అవుతుందని.. అవుట్ పుట్ అందరికీ నచ్చుతుందని తెలిపింది. ఈ మూవీ ట్రైలర్, పోస్టర్లు చూసి ‘అర్జున్ రెడ్డి’తో పోల్చారు కానీ ఈ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడి శ్రావ్యకు.. బ్రేకప్ అయిన సిద్ధార్థకు మధ్య మొదలైన సహజ ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపింది. సురేష్ బాబు గారు ఈ సినిమాని తీసుకోవడం మా అందరికీ పెద్ద సర్ప్రైజ్ అన్న యామిని.. రామానాయుడు స్టూడియోలో మా సినిమా పోస్టర్ చూసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని.. ఆ పోస్టర్ చూసి తాను, డైరెక్టర్ వరుణ్ రెడ్డి చాలా ఎమోషనల్ అయ్యామని తెలిపింది. ఇక డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న చిత్రాన్ని.. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు.

Next Story