- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైక్ సిద్ధార్థ ట్రైలర్ విడుదల.. మరో డీజే టిల్లు అవుతుందా?
టాలీవుడ్‌లో ఓవైపు యాంకర్‌గా మరోవైపు హీరోగా రానిస్తున్న నందు కొత్త సినిమాతో ముందుు వచ్చాడు. సైకో సిద్దార్థ్ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో నందు హీరోగా నటించగా యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ఓవైపు యాంకర్‌గా మరోవైపు హీరోగా రానిస్తున్న నందు కొత్త సినిమాతో ముందుు వచ్చాడు. సైకో సిద్దార్థ్ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో నందు హీరోగా నటించగా యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి వరున్ రెడ్డి దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ఈ సినిమాకు శ్రీనందుతో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ విడుదల చేస్తోంది.
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే డీజే టిల్లు, జాతిరత్నాలు లాంటి ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ లా కనిపిస్తుంది. ప్రేయసి మోసం చేసిన తరవాత యువకుడి జీవితం ఎలా మారింది. ఆ తరవాత అతడి జీవితంలోకి వచ్చిన వివాహిత ఎలా మార్చేసింది. చివరికి అనుకున్నది సాధించాడా అన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇక ట్రైలర్ ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉండగా ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. మరి డీజే టిల్లు లాంటి హిట్ కొడుతుందా లేదా చూడాలి. TRAILER






