Genelia: ఆయనతో స్క్రీన్ పంచుకోవడం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా.. జెనీలియా కామెంట్స్ వైలర్

by Chukka Sudharani |

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలు చేస్తున్న ఎవర్ గ్రీన్ జెనీలియా.. త్వరలో ‘జూనియర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Genelia: ఆయనతో స్క్రీన్ పంచుకోవడం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా.. జెనీలియా కామెంట్స్ వైలర్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలు చేస్తున్న ఎవర్ గ్రీన్ జెనీలియా.. త్వరలో ‘జూనియర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. యంగ్ హీరో కిరీటి, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ మూవీకి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. జులై 18న ‘జూనియర్’ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా.. వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటోన్న జెనీలియా దిగ్గజ నటుడు కోట శ్రీనివాస్ రావుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఆయనతో బొమ్మరిల్లు & రెడీ చిత్రంలో నటించాను. ఆయనొక ఒక సంస్థ... కోట శ్రీనివాసరావు గారి మరణం గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను’ అని తెలిపింది. కాగా.. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన చిత్రం ‘బొమ్మరిల్లు’. అందులో జెనీలియా తండ్రి పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు.

Next Story