‘జెట్లీ’ నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులు ఇరగదీసిన సత్య

by Chukka Sudharani |

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కాంబో సత్య - రితేష్ రాణా కలయికలో వస్తున్న ‘జెట్లీ’ సినిమా నుంచి తాజాగా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘జెట్లీ’ నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులు ఇరగదీసిన సత్య
X

దిశ, సినిమా: ‘మత్తు వదలరా’ సినిమాతో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించిన టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కాంబో సత్య - రితేష్ రాణా ఇప్పుడు మళ్లీ ‘జెట్లీ’తో సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అనే ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతూ ట్రెండ్ అవుతోంది. సత్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఈ పాటను ఎంతో ఫన్నీగా, ఎనర్జిటిక్‌గా డిజైన్ చేశారు. ఈ క్రేజీ సాంగ్‌కు కాలభైరవ అదిరిపోయే ఎలక్ట్రానిక్ బీట్స్‌తో మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా విజయ్ పోలకి కొరియోగ్రఫీలో సత్య వేసిన స్టెప్పులు చూస్తుంటే మతిపోవాల్సిందే. విజువల్స్ ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంటూ ఆడియన్స్‌ను ఇన్‌స్టాంట్‌గా అట్రాక్ట్ చేస్తున్నాయి. సత్య కేవలం కామెడీ మాత్రమే కాదు, అద్భుతంగా డ్యాన్స్ కూడా చేయగలనని ఈ పాటతో నిరూపించారు. ప్రమోషనల్ సాంగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గ్లామరస్‌గా కనిపిస్తూనే సత్యతో కలిసి స్టైలిష్ మూవ్స్‌తో అదరగొట్టింది. కాగా.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు.

Next Story