- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫంకీ నుంచి సెకండ్ సింగిల్ రట్టట్టావ్ పిల్లా ప్రోమో రిలీజ్..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswak Sen) 'ఫంకీ'(Funky) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswak Sen) 'ఫంకీ'(Funky) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న విశ్వక్, ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక ఇది 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ(Anudeep KV) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఇందులో స్టార్ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తున్నది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫంకీ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రట్టట్టావ్ పిల్ల’ అనే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. అలాగే.. ‘పెప్పీ బ్లాస్ట్ వచ్చేసింది.. #RATTATATAAV ప్రోమో ఇప్పుడే విడుదలైంది.. ఫంకీ 2వ సింగిల్ పూర్తి పాట ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదలవుతోంది’ అని రాసుకొచ్చారు. మాస్ బీట్‌తో సాగే ఈ సాంగ్ ప్రోమో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది.






