'పెద్ది' వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్.. చూసి కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు: అవినాష్ కొల్లా

by Chukka Sudharani |

పెద్ది ఒక ఎమోషనల్ మూవీ అని ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సినిమా విశేషాలు పంచుకున్నారు.

పెద్ది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్.. చూసి కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు: అవినాష్ కొల్లా
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండగా.. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘నా పదేళ్ల కెరీర్‌లో ఒక కథకి ఇంతలా ఎక్సైట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయాను. అంతలా కదిలించింది. కథలోనే ఇంత బలం ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ పరంగా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ఆడియన్స్‌కి సెట్ అని తెలియకపోవాలి. అప్పుడే ఒక ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. నా వరకు ఈ సినిమాకి వేసిన సెట్స్‌ను ఆడియన్స్ అవి సెట్ అని గ్రహించలేరు. అంత నేచురల్‌గా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘పెద్ది’ జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు. కచ్చితంగా ఆ ఎమోషన్ అయితే ఉంటుంది’ అని తెలిపారు.

అలాగే ‘‘పెద్ది’ విజయనగరం ఏరియాలో జరిగే కథ. అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ కూడా రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డిజైన్ చేశాం. అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఇందులో ఇప్పటివరకు ఎవరూ చూడని కుస్తీ సెటప్ చేశాం. దానికోసం అండర్‌గ్రౌండ్ సెటప్‌లో షూట్ చేశాం. చరణ్ గదతో కనిపించిన షాట్ అక్కడే చేశాం. ఇందులో ఒక హిల్ స్టేషన్ ఊరు కావాలి. అది హైదరాబాద్‌లోని ఒక బూత్ బంగ్లాలో వేశాం. మీరు సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్న ఊరిలా అనిపిస్తుంది. ఆ సెట్ వేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. సుకుమార్ మొన్న ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’కి మించి ఉంటుందని అన్నారు. దానికి కారణం ఈ కథలో అంత బలం ఉంది’ అంటూ మరిన్ని విశేషాలు పంచుకున్నారు.

Next Story