డిప్యూటీ సీఎం పవన్‌తో ముగిసిన నిర్మాతల భేటీ.. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి లైన్ క్లియర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-26 14:47:08  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది.

డిప్యూటీ సీఎం పవన్‌తో ముగిసిన నిర్మాతల భేటీ.. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి లైన్ క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో రాజమండ్రిలో టాలీవుడ్‌ సినీ నిర్మాతల బృందం భేటీ విజయవంతంగా ముగిసింది. వచ్చే వారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమాకు థియేటర్ల కేటాయింపులు, ప్రత్యేక ప్రదర్శనల విషయంలో వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల మండలి ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ‘పెద్ది’ సినిమా థియేట్రికల్ విడుదలకు ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేవని అధికారికంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ భేటీలో కేవలం ‘పెద్ది’ సినిమా ఇష్యూస్ మాత్రమే కాకుండా.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం, టికెట్ రేట్ల ఆప్టిమైజేషన్, ఇతర పరిశ్రమ సంబంధిత ఇబ్బందులను నిర్మాతలు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సినీ రంగానికి చెందిన అన్ని వర్గాల సమస్యలను తాము కూలంకషంగా పరిశీలిస్తున్నామని, పరిశ్రమ మనుగడకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వారికి భరోసాను ఇచ్చినట్లుగా తెలిపారు. ఏపీలో సినిమా ఇండస్ట్రీ సమస్యలను త్వరలోనే అధికారికంగా జీవోల (GOs) రూపంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లుగా నిర్మాతలు పేర్కొన్నారు.

‘పెద్ది’ గ్రాండ్ రిలీజ్ ఫిక్స్..

మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన రూ.350 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఇంటర్నెట్‌ను షేక్ చేయగా, ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ జోక్యంతో థియేటర్ల పంపిణీ సమస్యలు సద్దుమణగడంతో జూన్ 4న ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి స్క్రీన్లలో ఎలాంటి సమస్య లేకుండా రిలీజ్ కాబోతోంది.

చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నుంచి రెండో ట్రైలర్ ?

Next Story