- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నుంచి రెండో ట్రైలర్ ?
చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నుంచి రెండో ట్రైలర్ వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా చేసిన సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా, హీరోయిన్ గా జాన్వీ కపూర్ మెరువనున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. గౌరనాయుడు అనే రోల్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు అందిస్తుండగా... వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అదే జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే ట్రైలర్ లాంచ్ చేశారు. దీంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. అయితే సినిమా రిలీజ్ కు మరో వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. జనాలకు మరింత దగ్గరగా పెద్ది సినిమాను తీసుకువెళ్లేందుకు చిత్ర బృందం ప్లానింగ్ చేస్తోంది. ఇందులో భాగంగానే రెండో ట్రైలర్ కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా రానున్నట్లు టాక్ నడుస్తోంది.






