- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జన నాయగన్’ వాయిదా అందుకే.. వైరల్‌గా నిర్మాత షాకింగ్ కామెంట్స్
దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ కాకపోవడంపై నిర్మాత వెంకట్ కె. నారాయణ క్లారిటీ ఇచ్చాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశానికి ముందు నటించిన చిత్రం ‘జన నాయగన్. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం కారణంగానే సినిమా రిలీజ్ లేట్ అవుతూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ‘జన నాయగన్’ నిర్మాత వెంకట్ కె. నారాయణ ఓ టెంపుల్ వద్ద కనిపించగా.. ఈ సినిమా అప్డేట్ అడిగే ప్రయత్నం చేశారు మీడియా. తొలుత సమాధానం చెప్పేందుకు నిరాకరించిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. ‘జన నాయగన్ గురించి మాట్లాడానికి ఇది సరైన వేదిక కాదు. నేను ఆలయ దర్శనానికి వచ్చాను. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దానికోసమే వేచి చూస్తున్నాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంతకు మించి మాట్లాడటానికి ఇది వేదిక కాదు’ అని స్పష్టత ఇచ్చారు. అయితే.. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం.






