- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SKN : మనసుకు నచ్చిన సినిమా మొదలు పెట్టా.. మీకు చూపించటానికి ఉత్సాహంగా ఉన్నా.. నిర్మాత పోస్ట్
టాలీవుడ్ ప్రొడ్యూసర్ SKN తాజాగా ఓ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రొడ్యూసర్ SKN తాజాగా ఓ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘మనసుకు నచ్చిన సినిమా మొదలు పెట్టా.. టైటిల్ గ్లింప్స్ మీకు చూపించటానికి ఉత్సాహంగా ఉన్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి.. ఒక కొత్త సంస్కృతి వస్తోంది!.. ‘కలర్ ఫోటో, బేబీ’ సినిమాలతో కల్ట్ బ్లాక్‌బస్టర్స్ (Cult blockbusters) అందుకున్న మేకర్స్ నుంచి ఇది రాబోతుంది.. మణిశర్మ దీనికి మ్యూజికల్ మ్యాజిక్‌ను అందిచబోతున్నారు.. ఈ సోమవారం, జూన్ 2న సాయంత్రం 5:04 గంటలకు టైటిల్ & గ్లింప్స్ విడుదల చేయబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక పోస్టర్ గమనించినట్లయితే.. ఇందులో ఓ ఇద్దరు లవర్స్ బీచ్ ఒడ్డున నిలబడి ఉండగా.. పక్కన ఓ పడవ కూడా కనిపిస్తుంది. ఇక వీరిద్దరూ ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) అని తెలుస్తుండగా.. దీనిపై క్లారిటీ రావాలంటే గ్లింప్స్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. కాగా.. బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇక రీసెంట్‌గా వీరిద్దరి కాంబోలో మరో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ ఇదో కాదో వేచి చూడక తప్పదు.






