- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajasaab Teaser: మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది.. షాకింగ్‌గా ఫేమస్ ప్రొడ్యూసర్ కామెంట్స్

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘రాజాసాబ్’ (Rajasab). మారుతి (Maruti) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇక రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంటూ.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ వన్‌లో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది.. అలాగే ఒక స్నేహితుడి సంభావ్యత (Potentiality) క్లోజ్‌గా ఫీల్ అయ్యే బెస్ట్ ఫ్రెండ్‌కే తెలుస్తుంది. 20 ఏళ్లుగా నేను డైరెక్టర్ మారుతితో ట్రావెల్ చేస్తున్నాను. మీరు రాసిపెట్టుకోండి.. ఈ రోజు చెప్తున్న ఈ చిత్రాన్ని (రాజాసాబ్) ఎవరైతే తక్కువగా అంచనా వేశారో.. వాళ్లకు చెప్తున్న ఇది ఆల్ టైమ్ రికార్డ్ షో. ఎందుకంటే, 12 ఏళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ మిస్ అవుతున్న రెబల్‌ను ‘రాజాసాబ్’తో తీసుకువస్తున్నాడు డైరెక్టర్ మారుతి. రాజాసాబ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ నెగిటివ్ క్యాంపెయిన్ చేసాడు.. అదే ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. ఎందుకంటే మారుతి ఏ క్యాంపెయిన్‌లను నమ్మడు.. ఇలా మన సినిమా మీద నెగివిట్ స్ర్పెడ్ చేస్తున్నారు అని ఆయనకు చెప్పినప్పుడు.. నేను నన్ను నమ్మిన ప్రభాస్‌కు బెస్ట్ ఇస్తా అని చెప్పారు. అదే ఈరోజు వచ్చిన టీజర్. దీని తర్వాత సింగిల్స్ వస్తాయి.. ట్రైలర్ ఉంది.. డిసెంబర్ 5న రిలీజ్ ఉంది.. ఆ రోజు పాన్ ఇండియా షేక్ అవుద్ది’ అని తెలిపాడు.






