- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటి నుంచే షూటింగ్ స్టార్ట్.. చిరంజీవి సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఇటీవల చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో హీరోయిన్‌గా నయనతారా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే విషయంపై మరోసారి క్లారిటీ ఇస్తూ షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు నిర్మాత సాహు గారపాటి. తాజాగా ‘కిష్కింధపురి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకలో పాల్గొన్న ఈయన ‘మన శంకరవరప్రసాద్ గారు’ గురించి మాట్లాడుతూ.. ‘వెంకటేశ్ అక్టోబర్ నుంచి షూటింగ్‌లో జాయిన్ అవుతారు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది’ అని తెలిపారు. ఇది మెగాస్టార్ చిరంజీవి-విక్టరీ వెంకటేష్ కాంబోలో రాబోతున్న తొలి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.






