- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో నిర్మాత ఆర్ బీ చౌదరి మృతి.. ఐరన్ వ్యాపారం నుంచి సినీ ఇండస్ట్రీకి ఆయన ప్రయాణం
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి చౌదరి మరణించారు.

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి చౌదరి మరణించారు. ఉదయపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ దారుణ సంఘటన జరగగా.. ఆయన మరణ వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దశాబ్దాల కాలంగా ఎన్నో మరపురాని చిత్రాలని నిర్మించి, ఎందరో దర్శకులను, నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 100 సినిమాల వరకు నిర్మించిన ఈయన.. విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.
మొదటి అడుగు..
ఆర్.బి.చౌదరిగా గుర్తింపు పొందిన ఈయన అసలు పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. రాజస్థానీ కుటుంబానికి చెందిన ఈయన ఉక్కు, ఎగుమతులు, గోల్డ్ వంటి వ్యాపారాలు చేసి తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. మొదటగా మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థాన్నాన్ని స్టార్ట్ చేశారు. సూపర్ అనే పేరుతో సినిమాలు నిర్మించాడు. తర్వాత సూపర్ గుడ్ ఫిలింస్‌ను స్థాపించి తమిళంలో చెరణ పాండియన్ (1991) తో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి, తెలుగులో సుస్వాగతం చిత్రంతో అడుగుపెట్టారు.
ఫస్ట్ చిత్రంతోనే స్టార్ నిర్మాతగా..
1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన సుస్వాగతం తనే ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించారు. పవన్ కల్యాణ్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అప్పట్లోనే సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో మొదటి చిత్రంతోనే నిర్మాతగా ఆయన ప్రయాణం టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌గా పాతుకుపోయింది. తర్వాత సూర్యవంశం, నేను ప్రేమిస్తున్నాను, రాజా, నేటీ గాంధీ, శీను, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైన నీకు, సింహరాశి, స్నేహమంటే ఇదేరా, శివరామ రాజు, అందాల రాముడు, అన్నవరం, నవవసంతం, గోరింటాకు, రచ్చ, మిస్టర్ పెళ్లి కొడుకు, ద్వారక, భవన్, లవ్ టుడే, విద్యార్థి, సంక్రాంతి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. కాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను గెలుచుకున్నాయి. మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించిన చౌదరి, దాదాపు మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు.
తొలినాళ్లలో విజయ్‌తోనే
విజయ్ కెరీర్ తొలినాళ్లలో, ఆయనతో కలిసి 'పూవే ఉనక్కాగ' (1996), 'లవ్ టుడే' (1997), 'తుళ్ళాత మనముమ్ తుళ్ళుమ్' (1999), 'షాజహాన్' (2001), 'తిరుపాచ్చి' (2005), 'జిల్లా' (2014) లాంటి అనేక మాస్ సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఆ సినిమాలు విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి స్టార్ హీరోగా గుర్తింపునిచ్చాయి.






