కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్స్ ఎందుకు దొరకవు.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్‌కు కౌంటర్‌గా నిర్మాత వ్యాఖ్యలు

by Chukka Sudharani |

కిరణ్ అబ్బవరం త్వరలో ‘కె-ర్యాంప్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్స్ ఎందుకు దొరకవు.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్‌కు కౌంటర్‌గా నిర్మాత వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం త్వరలో ‘కె-ర్యాంప్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 18న రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్‌గా అబ్బవరం చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ‘ప్రదీప్ రంగనాథన్ లాంటి తమిళ హీరోకి తెలుగులో కావలసినన్ని థియేటర్లు దొరుకుతున్నాయి. నా సినిమాని నేను తమిళంలో రిలీజ్ చెయ్యాలని చూస్తే థియేటర్లు దొరకవు. ‘క’ మూవీని తమిళంలో రిలీజ్ చేయాలని ప్రయత్నించాను. కానీ థియేటర్లు ఇవ్వలేదు’ అని తెలిపాడు. ఈ కామెంట్స్‌పై రీసెంట్‌గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న ‘డ్యూడ్’ చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తుండ‌గా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అక్టోబర్ 17 రిలీజ్ కాబోతుంది. ఇందులో భాగంగా తాజాగా ‘డ్యూడ్’ ట్రైలర్ రిలీజ్ చెయ్యగా.. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కిరణ్ అబ్బవరం కామెంట్స్‌పై షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు. ‘తమిళనాడులో దీపావళి పెద్ద పండుగ. పైగా అక్కడ ఉన్న థియేటర్లు మనతో పోల్చితే తక్కువే. సినిమాకి వచ్చే ఫస్ట్ డే టాక్‌ని బట్టే థియేటర్లు అడ్జెస్ట్ అయిపోతుంటాయి. బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉన్న సినిమాకి రెండవ రోజు నుంచి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి. అదేమీ పెద్ద సమస్య కాదు’ అని తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. స్ట్రాంగ్ కౌంటర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. తెలుగు వాళ్లను కంటే తమిళ వాళ్లనే మనవాళ్లు ఎక్కువ సపోర్ట్ చేస్తారంటూ మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story