ఇది పాన్ ఇండియా కంటెంట్.. జటాధర మూవీపై హైప్ పెంచేసిన నిర్మాత కామెంట్స్

by Chukka Sudharani |

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’.

ఇది పాన్ ఇండియా కంటెంట్.. జటాధర మూవీపై హైప్ పెంచేసిన నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తుండగా ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కాబోతుండగా.. నిర్మాత ప్రేరణ అరోరా మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘తెలుగులో సినిమా చేయాలనేది ఎప్పటినుంచో నా కల. తెలుగు సినిమా, తెలుగు కల్చర్ అంటే చాలా ఇష్టం. నేను హిందీలో సినిమాలో చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. కమర్షియల్, మాస్, హ్యాపీ, ఫ్యామిలీ అన్ని ఎమోషన్స్‌తో తెలుగు చిత్రాలు అద్భుతంగా ఉంటాయి. గొప్ప సినిమాలని ఇండియన్ సినిమాకి తెలుగు సినిమా అందించింది. అలాగే జటాధర చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఇందులో ఫ్యామిలీ, ఎమోషన్స్, సూపర్ నేచురల్, మైథలాజికల్ అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా బ్లెండ్ అయ్యాయి. ఇది పాన్ ఇండియా కంటెంట్. అందుకే హిందీలో కూడా ఈ సినిమాని చేయాలనుకున్నాం. అలా తెలుగు, హిందీలో రెండు భాషల్లోనూ ఈ సినిమాని చేయడం జరిగింది. సినిమా విజువల్‌గా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సీక్వెల్‌లా ఫ్రీక్వెలా అని చెప్పలేము గాని ఈ సినిమాకి కొనసాగింపుగా ఇంకో సినిమా అయితే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత.



Next Story